మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు : మహబూబ్ నగర్ ఎస్పీ జానకి నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, ఎఫ్ఐఆర్ నమోదు, పెండింగ్ కేసులు, సీసీటీఎన్ఎస్ ఆన్‌లైన్ అప్‌డేట్లను పరిశీలించారు. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారికి చట్టపరమైన అండగా నిలవాలని సిబ్బందికి సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని, రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్‌పెక్టర్ ఇజాజ్ఉద్దీన్, సబ్ ఇన్స్‌పెక్టర్లు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
