ములుగు, వరంగల్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ‘మహాలక్ష్మి’ సంబురాలు

ములుగు, వరంగల్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ‘మహాలక్ష్మి’ సంబురాలు

ములుగు/ గ్రేటర్​ వరంగల్/ ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం ములుగు, వరంగల్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం– ఉత్సవాలు 2026 కార్యక్రమాలను నిర్వహించారు. ములుగులో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్​ దివాకర పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 1.90 కోట్ల ప్రయాణాల ద్వారా మహిళలు రూ.133.25 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ త్వరలో సోలార్​ యూనిట్లు, పెట్రోల్​ బంకులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.​ వరంగల్​ బస్టాండ్​ వద్ద నిర్వహించిన సంబురాల్లో కలెక్టర్​ సత్యశారదాదేవి, బల్దియా మేయర్​ గుండు సుధారాణి పాల్గొని మాట్లాడారు. 

జిల్లాలో నమోదైన ఉచిత ప్రయాణాల ద్వారా మహిళలు రూ.270 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. టెక్స్​టైల్​ పార్క్​, కేటెక్స్, యంగ్ వన్ వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయని, మహిళలకు అవసరమైన శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం నూతన బస్టాండ్​లో ఆర్టీసీ రీజినల్​ మేనేజర్​ సరిరాం అధ్యక్షతన నిర్వహించిన సెలబ్రేషన్స్​లో కేఎంసీ సిటీ మేయర్ పూనుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా హాజరై మాట్లాడారు. అనంతరం పలువురి మహిళా ప్రయాణికులను సన్మానించి, బహుమతులు అందజేశారు.