కట్నం కోసం వేధింపులు.. పాపతో కలిసి తల్లి ఆత్మహత్య

కట్నం కోసం వేధింపులు.. పాపతో కలిసి తల్లి ఆత్మహత్య

అత్తింటి వేధింపులు తట్టుకోలేక రెండేండ్ల పాపతో కలిసి మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీతారాంబాగ్​కు చెందిన శ్రీకాంత్,  మహాలక్ష్మి(27) దంపతులకు కూతురు సహస్రిక(22 నెలలు) ఉంది. శ్రీకాంత్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు. అదనపు కట్నం కోసం భర్త, అత్త కొంతకాలంగా మహాలక్ష్మిని వేధిస్తున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు ఆమె.. పాప సహస్రికతో కలిసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తల్లీబిడ్డ మృతిచెందారు.

భర్త శ్రీకాంత్, అతడి తల్లిపై మహాలక్ష్మి బంధువులు హబీబ్​నగర్ పోలీస్ స్టేషన్​లో కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.