స్నిఫర్ డాగ్‌ కు మహారాష్ట్ర పోలీసుల ఘన వీడ్కోలు

స్నిఫర్ డాగ్‌ కు మహారాష్ట్ర పోలీసుల ఘన వీడ్కోలు
  • నీ సేవలకు సెల్యూట్

నాసిక్: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని స్నిఫర్ డాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అది అందించిన ఉత్తమ సేవలకు ఘనమైన వీడ్కోలు లభించింది. స్పైక్ స్నిఫర్ డాగ్.. మహారాష్ట్ర నాసిక్‌లోని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో 11 ఏండ్ల పాటు సేవలందించింది. బాంబులను గుర్తించడంలో, వాటిని
విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషించింది. అది ఈ ఏడాది ఫిబ్రవరి 24న 11 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా పోలీసులు దానికి
గొప్పగా ఫేర్ వెల్ ఇచ్చారు. పోలీస్ వాహనాన్ని పువ్వులు, బెలూన్స్‌తో అలంకరించి .. దాని బానెట్‌పై డాగ్‌ను కూర్చొబెట్టి పరేడ్ నిర్వహించారు. వాహనానికి రెండు పక్కల ఉన్న పోలీసులు.. స్నిఫర్ డాగ్ సేవలను ప్రశంసిస్తూ చప్పట్లు కొట్టారు. ఈ వీడియోను మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ శనివారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘అది కేవలం కుక్క మాత్రమే కాదు. పోలీస్ కుటుంబంలో భాగం. దేశానికి అది అందించిన సేవలకు సెల్యూట్ చేస్తున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు.