ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్ధనే, బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ కు ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం కొత్త బాధ్యతలు అప్పగించింది. ముంబై ఫ్రాంచైజీకి చెందిన ముంబై ఇండియన్స్‌తో పాటు ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ కేప్‌టౌన్ జట్లతో కూడిన MI 'OneFamily' అనే సెంట్రల్ టీం మేనేజ్‌మెంట్ను చూసుకునేందుకు రిలియన్స్ యాజమాన్యం వీరిద్దరికి కీలక పదవులను కట్టబెట్టింది. జహీర్ ఖాన్‌ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా, మహేలా జయవర్దనేను గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫామెన్స్‌గా నియమించింది.
జయవర్ధనే బాధ్యత ఏంటంటే..?
గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ MIగా నియమించబడిన జయవర్థనే.. సెంట్రల్ టీం వ్యూహాత్మక ప్రణాళిక, సమీకృత గ్లోబల్ హై -పెర్ఫార్మెన్స్ ఎకో-సిస్టమ్‌ను సృష్టించడం, ప్రతి జట్టు కోచింగ్‌కు బాధ్యతతో సహా ప్రపంచవ్యాప్తంగా గ్రూప్ క్రికెట్ కార్యకలాపాలకు సీనియర్ నాయకత్వాన్ని అందించనున్నాడు. టీమ్స్ స్ట్రక్చర్‌లు, సినర్జీలను కూడా జయవర్ధనే చూసుకోనున్నాడు. అలాగే మూడు జట్ల టీమ్ హెడ్ కోచ్‌లతో సన్నిహితంగా పని చేస్తూ ఎంఐ బ్రాండ్ ఆటను తీసుకువచ్చేలా విధులు నిర్వర్తించనున్నాడు. జయవర్ధనేకు గ్లోబల్ హెడ్ పొజిషన్ దక్కడంతో ముంబై ఇండియన్స్‌తో పాటు.. MI ఎమిరేట్స్, MI కేప్‌టౌన్ జట్లకు కొత్త కోచ్‌లను నియమించనున్నారు. ఈ కోచ్‌లు జట్లకు సంబంధించిన అన్ని విషయాలను జయవర్ధనేకు నివేదించనున్నారు.
? Head Coach ➡️ Global Head of Performance ?
— Mumbai Indians (@mipaltan) September 14, 2022
We are delighted to announce Mahela Jayawardene as our Global Head of Performance ??#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @MahelaJay pic.twitter.com/I4wobGDkOQ
జహీర్ ఖాన్ ఏం చేస్తాడంటే..?
గ్లోబల్ హెడ్ ఆఫ్ డెవలప్ మెంట్‌గా నియమితులైన జహీర్ ఖాన్.. క్రికెట్ డెవలప్‌మెంట్, ప్లేయర్ డెవలప్‌మెంట్‌కు బాధ్యత వహించనున్నాడు. ప్రతిభను గుర్తించడం, ఎంఐ ప్రోగ్రామ్‌ను రూపొందించడం, భౌగోళిక ప్రాంతాలలో వాటిని అమలు చేయడం, ప్రతీ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఐ టీమ్స్‌కు సాయం చేయడంలో కీలకంగా వ్యవహరించనున్నాడు.
? Director of Cricket Operations ➡️ Global Head of Cricket Development ?
— Mumbai Indians (@mipaltan) September 14, 2022
Let's welcome ZAK as our Global Head of Cricket Development ?#OneFamily #MumbaiIndians #MIemirates #MIcapetown @MIEmirates @MICapeTown @ImZaheer pic.twitter.com/VBfzzrBG6J
కొత్త బాధ్యత చేపట్టేందుకు ఎదురు చూస్తున్నా..
MI గ్లోబల్ క్రికెట్ కార్యకలాపాలకు నాయకత్వం వహించడం సంతోషంగా ఉందని మహేలా జయవర్ధనే అన్నాడు. అంబానీ, ఆకాశ్ నాయకత్వం, మార్గదర్శకత్వం ఎంఐని మరింత విలువైన గ్లోబల్ క్రికెట్ ఫ్రాంచైజీగా మార్చనుందని చెప్పారు. ఎంఐ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందడం చూసి చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఎంఐ బ్రాండ్‌ను నిర్మించడానికి తాను కొత్త బాధ్యత చేపట్టడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు.
నాకు ఎంఐ ఒక నిలయం..
గ్లోబల్ హెడ్ ఆఫ్ డెవలప్ మెంట్ పాత్రను స్వీకరించడానికి తాను వినయపూర్వకంగా భావిస్తున్నానని జహీర్ ఖాన్ అన్నాడు. తనపై నమ్మకం ఉంచిన నీతా అంబానీ, ఆకాశ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు. ఆటగాడిగానే కాకుండా కోచింగ్ టీమ్ మెంబర్‌గా ఎంఐ తనకు నిలయంగా ఉందన్నాడు. ఎంఐ ఫ్యామిలీలో తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నానని.. కొత్త సామర్థ్యాన్ని వెలికితీసేందుకు గ్లోబల్ నెట్‌వర్క్‌లోని అందరితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని జహీర్ ఖాన్ తెలిపాడు.
