బిగ్ ఫైట్ : మహేష్ బన్నీ తగ్గేలా లేరు

బిగ్ ఫైట్ : మహేష్ బన్నీ తగ్గేలా లేరు

సంక్రాంతికి టాలీవుడ్ లో  బిగ్ ఫైట్ జరగబోతుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న సరిలేరు నీకెవ్వరూ..త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న అలా వైకుంఠపురములో  రెండు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి.  జనవరి 12,2020 న రిలీజ్ చేస్తున్నట్లు రెండు సినిమాల టీంలు ప్రకటించాయి. అల్లు అర్జున్ మూవీ రిలీజ్ డేట్ ను గీతా ఆర్ట్స్ తన  ట్విట్టర్లో  ప్రకటించిన కాసేపటికే..మహేశ్ బాబు ట్విట్టర్ నుంచి సరిలేరు నీకెవ్వరూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు కావడం, అలాగే ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు. ఒకే రోజు రిలీజ్ అయితే  థియేటర్ల సమస్య కూడా వస్తుంది. అలాగే కలెక్షన్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. మరి సంక్రాంతి పండుగ కాబట్టి రెండు సినిమాలను రిలీజ్ చేస్తారా? లేక అప్పటి వరకు ఏమైనా మార్పులు జరుగుతాయా? అనేది వెయిట్ చేయాలి.