Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు

Pokiri Trending Story: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పోకిరి..పండుగాడి వెనుకున్న ఆసక్తికర విశేషాలు

టాలీవుడ్లో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి మహేష్ బాబును(Mahesh Babu) స్టార్ ను చేసిన మూవీ పోకిరి(Pokiri).పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్లో 2006లో వచ్చి ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోయిన పోకిరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.

పోకిరి  సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలైనప్పటికీ...ఆ మూవీలోని డైలాగ్స్, సాంగ్స్ కున్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. కాగా బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన ఈ సినిమా విడుదలై నేటికి(ఏప్రిల్‌ 28) 18 సంవత్సరాలు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా పండుగాడికి పద్దెనిమిదేళ్లు అంటూ సోషల్ మీడియాలో పోస్టుల మోత మోగుతోంది.ట్వీట్‍లతో మహేశ్ ఫ్యాన్స్ మోతెక్కిస్తున్నారు. చాలా మంది ప్రేక్షకులు ఈ చిత్రంలోని హైలైట్‍లను,రికార్డులను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.దీంతో నేడు ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‍ఫామ్‍లో పోకిరి ట్రెండింగ్‍లో ఉంది.

అలాగే ఈ సినిమా వెనుక కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి.అవేంటో చూద్దాం..

పూరి జగన్నాథ్ డైరెక్షన్

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు.. అంటూ థియేటర్లలో ప్రిన్స్ మహేశ్ బాబు చేసిన రచ్చను ఎవరైనా మర్చిపోతారా. ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిపోయిన పోకిరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఎప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో సుపరిచితమే. 

పోకిరి కలెక్షన్స్ 

ఈ సినిమా మొత్తం టాలీవుడ్‍లోనే హయ్యెస్ట్ కలెక్షన్లతో దుమ్మురేపింది. ఈ మూవీ మొత్తంగా సుమారు రూ.70కోట్ల గ్రాస్ (సుమారు రూ.40 కోట్ల షేర్) కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద దక్కించుకుంది. 2006లోనే రూ.70కోట్లను దక్కించుకొని ఓవరాల్ ఇండియా ఇండస్ట్రీస్ ని ఆశ్చర్యపరిచింది. ఈ రికార్డును 2009లో చరణ్ మగధీర బ్రేక్ చేసింది. సుమారు రూ.12 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన పోకిరి మూవీ రూ.70కోట్ల వసూలు చేసి దుమ్మురేపింది. అంతేకాదు ఈ మూవీ ఏకంగా 200 థియేటర్లలో 100 రోజులను పూర్తి చేసుకుంది.

పోకిరి స్టోరీ

డైరెక్టర్ పూరి తన ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ ‘బద్రి’ కన్నా ముందే పోకిరి స్క్రిప్ట్‌ను రాసుకున్నారట. ఫస్ట్ ఈ మూవీ స్టోరీకి హీరోలుగా పవన్‌కల్యాణ్‌, రవితేజలను కూడా అనుకున్నారట. ఈ చిత్రాన్నికి ‘ఉత్తమ్‌ సింగ్‌.. సన్నాఫ్‌ సూర్య నారాయణ’ అనే టైటిల్‌తో తెరపైకి తీసుకొద్దామని పూరి డిసైడ్ అయిపోయారట. కానీ, అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత కొన్నాళ్లకు ఈ కథ మహేష్‌ బాబు దగ్గరకు వెళ్లడంతో..స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి పూరి దాన్ని ‘పోకిరి’గా మార్చారు.

డైలాగ్‍లు..క్లైమాక్స్

పోకిరి చిత్రంలో మహేష్ చెప్పే కొన్ని డైలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి.“ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‍ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు”..“ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను”..“బుల్లెట్ దిగిందా లేదా” ఇలా మరిన్ని డైలాగ్స్ కూడా ఇండస్ట్రీతో పాటు నార్మల్ ఆడియన్స్ మైండ్ లో హైలైట్ అయ్యాయి. పూరి రాసిన ఈ పవర్ ఫుల్ డైలాగ్‍లను..మహేశ్ తన స్వాగ్ తో చెప్పిన విధానం అదిరిపోయింది. ఇక, గ్యాంగ్‍స్టర్ పండు (మహేశ్ బాబు)నే కృష్ణ మనోహర్ ఐపీఎస్ రివీల్ చేసే ట్విస్ట్ అప్పట్లో ఆడియన్స్ ని థ్రిల్ ఇచ్చింది. అంతేకాదు ఇది ఒకానొక బెస్ట్ క్లైమాక్స్‌గా తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోయింది.

మహేష్‌బాబు లుక్ 

‘పోకిరి’ మూవీ ముందు వరకు మహేష్‌ చేసిన ప్రతి సినిమాల్లోనూ ఆయన లుక్‌ దాదాపు ఒకేలా..స్మార్ట్ యాంగిల్ లో ఉండేది. లైట్‌ హెయిర్‌, క్లీన్‌ షేవ్‌తో బాలీవుడ్‌ హీరోలా టోటల్లీ క్లాస్‌గా దర్శనమిచ్చేవారు.ఇక  ‘పోకిరి’ చిత్రంతో మహేష్‌ను తొలిసారి ఊర మాస్‌ యాంగిల్‌లో చూపించారు డైరెక్టర్ పూరి. ఆయన మహేష్‌కు ఈ కథ చెబుతున్నప్పుడే జుట్టు బాగా పెంచి..లైట్‌గా మీసం,గెడ్డంతో ఉండాలని పూరి సూచించారట. 

పోకిరి హీరోయిన్ గా కంగన 

పోకిరి సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ అనుకున్నది అయేషా టకియాని. ఆమె కొన్ని కారణాల ఈ క్రేజీ పాత్రను వదులుకుంది. తర్వాత ఆ అవకాశాన్ని బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ దక్కించుకుంది. అయితే, పోకిరి ఆడిషన్స్‌ ముంబయిలో జరుగుతున్న సమయంలో..అక్కడే బాలీవుడ్‌ మూవీ ‘గ్యాంగ్‌స్టర్‌’కూ కూడా ఆడిషన్స్‌ జరిగాయట. దీంట్లో పాల్గొనడానికి వచ్చిన హీరోయిన్ కంగన..అదే సమయంలో ‘పోకిరి’ సినిమాకు గాను ఆడిషన్స్‌ ఇచ్చింది. ఇక కంగన అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ, కంగనాకు ఈ రెండు సినిమాల్లోనూ అవకాశం దక్కింది. అయితే వీటిలో ఏదో ఒక దాన్నే చేయాల్సి రావడంతో ఆమె మహేష్ ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో ఆ అవకాశం కాస్తా ఇలియానాను వరించింది. 

పోకిరి సాంగ్స్ 

మహేష్ బాబు పోకిరి మూవీకి మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఈ మూవీలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.ప్రతి పాట కథకు తగిన మ్యాజిక్ ని తీసుకొచ్చాయి.  

ఇక ఇవే కాదు.. ఈ సినిమాలోని ప్రతి సీన్..ప్రతి క్యారెక్టర్ చాలా స్పెషల్. ఎంత అంటే ఎన్నాళ్లయినా మరిచిపోలేనంత. దటీజ్..పండుగాడు!

  • Beta
Beta feature