Khaleja4KFromMay30: అప్పుడేమో డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్బస్టర్.. రీ-రిలీజ్ టికెట్ సేల్స్లో ఖలేజా ట్రెండ్సెట్టర్ !

Khaleja4KFromMay30: అప్పుడేమో డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్బస్టర్.. రీ-రిలీజ్ టికెట్ సేల్స్లో ఖలేజా ట్రెండ్సెట్టర్ !

మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమా తెలుగు సినిమాల రీ రిలీజ్ రికార్డులను బద్ధలు కొట్టుకుంటూ ముందుకుపోతుంది. మే 30న రీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ సినిమా రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ బిజినెస్ 3 కోట్ల రూపాయలు దాటిపోయింది. ‘ఖలేజా’ రీ రిలీజ్ టికెట్లు ‘బుక్ మై షో’లో లక్షకు పైగా అమ్ముడుపోవడం టాలీవుడ్ను విస్మయానికి గురిచేసింది.

‘ఖలేజా’ రీ రిలీజ్ టికెట్ ఫైనల్ సేల్స్ వరల్డ్ వైడ్గా 2 లక్షలు దాటిపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2010 అక్టోబర్ 7న మహేష్ ఖలేజా సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే.. మహేష్ ‘ఖలేజా’ సినిమా ఎందుకో ఆ టైంలో జనాలకు పెద్దగా ఎక్కలేదు. కానీ.. ‘ఖలేజా’ సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇంత వినోదాత్మకంగా ఉన్న సినిమాను థియేటర్లలో ఎందుకు ఫ్లాప్ చేశారనే డిస్కషన్ ఇప్పటికీ నడుస్తూనే ఉంటుంది.

రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఖలేజా సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్లో ఈ సినిమా రీ రిలీజ్ అవుతున్న థియేటర్లు దాదాపు ఫుల్ అయిపోతున్నాయి. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఫస్ట్ టైం టాలీవుడ్లో ఒక సినిమా రీ రిలీజ్కు హైదరాబాద్లో ప్రీమియర్ షోలు పడుతున్నాయంటే ‘ఖలేజా’ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సుదర్శన్ 35MM, దేవీ 70MM, సంధ్య 70MM, సంధ్య 35MM థియేటర్లతో పాటు కూకట్పల్లిలోని విశ్వనాథ్ 70MM, భ్రమరాంబ 70MM, మల్లిఖార్జున 70MM, అర్జున్ 70MM థియేటర్లలో, మూసాపేట్ శ్రీరాములు 70MM, ఎర్రగడ్డ గోకుల్ 70MM, మల్కాజ్ గిరి శ్రీ సాయిరామ్ 70MM, హైటెక్ సిటీ బీఆర్ హైటెక్ 70MM థియేటర్లలో మహేష్ ఖలేజా సినిమా మే 29న ప్రీమియర్ షోలు పడుతున్నాయి. మహేష్ బాబు సినిమాలైన ‘మురారి’, ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’, ‘గుంటూరు కారం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఇప్పటికే రీ రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించాయి.