క్లైమాక్స్ లో మహేష్ బాబు మహర్షి

 క్లైమాక్స్ లో మహేష్ బాబు మహర్షి

వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా మహర్షి. సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతోంది. క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి..మార్చి 15 వరకు రెండు పాటలు ఫినిష్ చేస్తామని తెలిపింది యూనిట్. దీంతో సినిమా కంప్లీట్ అవుతుందని ఇవాళ ట్విట్టర్ ద్వారా తెలిపింది యూనిట్.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌కు ఇది 25వ సినిమా కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు యూనిట్‌. పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుతున్నాయి. అన్నీ కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 25న విడుద‌ల చేసేందుకు నిర్ణయించింది యూనిట్. సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోహిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.