అమ్మకు కన్నీళ్లతో ‘నాని’ నివాళి

అమ్మకు కన్నీళ్లతో ‘నాని’ నివాళి

అమ్మ మరణంతో రాజకుమారుడు చిన్నబోయాడు. మహర్షి కన్నీటి పర్యంతమయ్యాడు. సినీ దర్శకురాలు, అలనాటి హీరోయిన్, తన పినతల్లి విజయనిర్మల మరణంతో… మహేశ్ బాబు విషాదంలో మునిగిపోయాడు. విజయనిర్మల పార్థివదేహంపై పూలమాల వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నాని.

మహిళాభ్యుదయానికి మారుపేరుగా నిలిచి.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన విజయనిర్మల మరణంతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో ఉంది. దిగ్గజ నటుడు, ఆమె భర్త అయిన సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం ఆవేదన చెందుతోంది. నానక్ రామ్ గూడలోని ఇంట్లో విజయనిర్మల పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు అర్పించారు.

రేపు అంత్యక్రియలు

విజయనిర్మల అంతిమ యాత్ర రేపు శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. నానక్ రామ్ గూడలోని ఆమె ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని ఫామ్ హౌజ్ లో విజయనిర్మల అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.