
సినీ హీరో మహేష్ బాబుకు చెందిన AMB సినిమా హాల్ లో తగ్గిన GST రేట్లకు అనుగునంగా టికెట్ రేట్లను తగ్గించలేదు. దీంతో మల్టిప్టెక్స్ యాజమాన్యానికి నోటీసులు పంపారు అధికారులు. తప్పును గ్రహించిన AMB… టికెట్ రేట్లపై ఎక్కువగా వసూలు చేసిన రూ.35.60 లక్షలను కస్టమర్ వెల్ఫేర్ ఫండ్ కు చెల్లిస్తామని తెలిపింది.
జనవరి 1నుంచి 100 రూపాయలకు పైబడిన సినిమా టికెట్లపై 28శాతంగా ఉన్న GST ని 18 శాతానికి తగ్గించారు. అయితే AMB మల్టిప్టెక్స్ లో మాత్రం తగ్గిన GST ధరలకు అనుగునంగా.. టికెట్ రేటు తగ్గక పోవడంతో GST అధికారులు మల్టిప్టెక్స్ యాజమాన్యానికి నోటీసులిచ్చింది. దీంతో తప్పును ఒప్పుకుని నివారణ చర్యలు చేపట్టింది AMB.