శిల్పా చౌదరి పై మహేశ్ బాబు సోదరి ఫిర్యాదు

శిల్పా చౌదరి పై మహేశ్ బాబు సోదరి ఫిర్యాదు

శిల్ప చౌదరిపై తాజాగా పోలీసులు మరో ఫిర్యాదు అందింది. ఆమె మాటల మాయలో ప్రముఖులు సైతం మోసపోయారు. తాజాగా శిల్ప చౌదరిపై టాలీవుడ్ ప్రముఖ హీరో మహేశ్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు సతీమణి అయిన ప్రియదర్శిని పోలీసులకు ఫిర్యాదు చేశాారు. తన వద్ద నుంచి రెండున్నర కోట్ల రూపాయలు ఎగ్గొట్టిందని శిల్ప చౌదరిపై ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఆమె ఈ మేరకు వివరాలు అందించారు. శిల్ప చౌదరి తన వద్ద నుంచి రూ. 2.9 కోట్ల రూపాయల నగదు తీసుకొని మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిట్టి పార్టీల సందర్భంగా తమకు శిల్ప పరిచయం అయిందని పోలీసులకు ఆమె తెలిపారు.

కోట్లలో జనానికి కుచ్చుటోపి పెట్టిన శిల్పా చౌదరి వ్యవహరంలో ఇప్పటికే కీలక విషయాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. కిట్టి పార్టీ లో పాల్గొన్న  చాలా మంది మహిళల నుంచి  శిల్ప చౌదరి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. డబ్బుల వసూలు కోసమే ప్రతి వీకెండ్లో శిల్ప కిట్టీ పార్టీ ఏర్పాటు చేసేది. దీంతో ఇప్పటికే చాలామంది ఈ వ్యవహారంలో తాము మోసపోయామంటూ... పోలీస్ స్టేషన్ కు శిల్పచౌదరి బాధితులు క్యూ కడుతున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే శిల్పపై మూడు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా అందిన ఫిర్యాదులతో పోలీసులు మరోసారి శిల్పా చౌదరిని తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే పోలీసులు కస్టడీ కోరుతూ దాఖలైన పిటీషన్ పై రాజేందర్ నగర్ కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. మరోవైపు శిల్పకు సంబంధించి రెండు అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఆమెకు చెందిన మరికొన్ని అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. అంత డబ్బు   ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.