టాప్-8 స్విమ్మర్లలో మహేశ్ బాబు తనయుడు గౌతమ్

టాప్-8 స్విమ్మర్లలో మహేశ్ బాబు తనయుడు గౌతమ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల తనయుడు గౌతమ్ క్రీడారంగంలో సత్తా చాటుతున్నాడు. తన ఏజ్ గ్రూపులో తెలంగాణలోని టాప్-8 స్విమ్మర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ విషయాన్ని నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గౌతమ్ స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

2018 నుంచి స్విమ్మింగ్ లో టాలెంట్  చూపిస్తున్నాడని తెలిపారు. రెండేళ్లలోనే స్విమ్మింగ్ లోని మెళకువలను తెలుసుకుని రాష్ట్రస్థాయిలో ప్రతిభావంతుడైన స్విమ్మర్ గా ఎదిగాడని వివరించారు.

అంతేకాదు స్విమ్మింగ్ లోని నాలుగు ప్రధాన విభాగాలైన బటర్ ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీస్టైల్ విభాగాల్లో నైపుణ్యం సాధించాడని నమ్రతా తెలిపారు.అన్నింటిలోకి గౌతమ్ కు ఫ్రీస్టైల్ అంటే ఇష్టమన్నారు. అంతేకాదు 5 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల్లో నిర్విరామంగా ఈదగలడని చెప్పారు.