యూట్యూబ్ చానల్ ను మొదలుపెట్టిన మహేశ్ బాబు కూతురు

యూట్యూబ్ చానల్ ను మొదలుపెట్టిన మహేశ్ బాబు కూతురు

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు కూతురు సితార సొంతంగా యూట్యూబ్ లో ఓ చానల్ ప్రారంభించింది. తన ఫ్రెండ్ తో కలిసి A&S అనే పేరుతో చానల్ ను ప్రారంభించారు. ఇందులో ‘A’ అంటే ఆద్య. ఈ అమ్మాయి ఎవరో కాదు దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె. ‘S’ అంటే సితార. ఆద్య, సితార మంచి ఫ్రెండ్స్ కావడంతో తమ పేర్లలోని మొదటి అక్షరాలతో A&S యూట్యూబ్ చానల్ ఆరంభించారు. మొదటి వీడియోగా ‘3 మార్కర్స్ చాలెంజ్’ పేరుతో ఓ వీడియోను ఇవాళ పోస్ట్ చేశారు.

చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. యూట్యూబ్ లో ఈ వీడియోకు ఇప్పటికే వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ గుడ్ ఫ్రెండ్స్ కోసం మహేశ్ బాబు కూడా రంగంలోకి దిగారు. సితార, ఆద్య రూపొందించిన వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసి… ఇద్దరు చిన్నారులకు శుభాకాంక్షలు చెప్పారు.