త్వరలో కాంగ్రెస్ పార్టీ లోకి భారీగా చేరికలు : మహేశ్వర్ రెడ్డి

త్వరలో కాంగ్రెస్ పార్టీ లోకి  భారీగా చేరికలు : మహేశ్వర్ రెడ్డి


త్వరలో కాంగ్రెస్ పార్టీ లోకి  భారీగా చేరికలు ఉంటాయని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి అన్నారు.  ఉత్తర తెలంగాణ నుంచి ఒక ఎంపీ , దక్షిణ తెలంగాణ నుంచి ముగ్గురు  ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో  చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వాళ్లందరూ తనతో రెగ్యులర్ గా వాళ్లు టచ్ లో ఉన్నట్లుగా మహేశ్వర్ రెడ్డి పెర్కొన్నారు. అయితే చేరికలు రాహుల్ పాదయాత్రలో ఉంటాయా లేదా అన్నది త్వరలోనే  తెలుస్తోందన్నారు. 

బీజేపీ పై మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీకి 70 ,80 నియోజకవర్గాల్లో అభ్యర్దులే లేరని విమర్శించారు.  చాలా సెగ్మెంట్ లలో బీజేపీకి  కనీసం బూత్ స్థాయి ఏజెంట్ లు కూడా  లేరన్నారు. ఒకటి రెండు ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన అధికారంలోకి వస్తారనుకోవడం తప్పన్నారు. ఇక బీఆర్ఎస్ బీహార్ కు పోతదో.. ఎక్కడికి పోతదో తనకు తెలియదని తెలిపారు.  కాంగ్రెస్ చరిత్రలో బై ఎలక్షన్ కొత్త కాదన్న మహేశ్వర్ రెడ్డి... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లే గెలవడమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.