దేశంలోనే గొప్ప ఆలయంగా బాసరను తీర్చి దిద్దుతాం: పిప్రి సభలో సీఎం రేవంత్

దేశంలోనే గొప్ప ఆలయంగా బాసరను తీర్చి దిద్దుతాం: పిప్రి సభలో సీఎం రేవంత్

బాసర సరస్వతీ ఆలయాన్ని దేశంలోని గొప్ప ఆలయంగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రూ.225 కోట్లతో ఆలయాన్ని విస్తరించి..  ఆలయ పవిత్రను కాపాడుతామన్నారు. భద్రాచలం నుంచి బాసర వరకు ఆలయాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. 2026 ఏప్రిల్ 06 (సోమవారం) ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా  పలు ఆలయ నిర్మాణ పనులకు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు వరాల జల్లులు కురిపించారు.

 సీఎం రేవంత్ స్పీచ్ హైలైట్స్:

  • పిప్రి నుంచే డిప్యూటీ సీఎం భట్టి పాదయాత్ర మొదలుపెట్టారు
  • బోథ్, నిర్మల్ లో మా ఎమ్మెల్యేలు లేరు.. అయినా అభివృద్ధి ఆగడం లేదు
  • మా పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి చేస్తామని అనడం లేదు
  • మేం పార్టీలు చూడకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం
  • మా ఎమ్మెల్యేలు లేకపోయినా.. ఇక్కడ వందల కోట్ల పనులు మంజూరు చేస్తున్నాం
  • ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధి
  • ఆదిలాబాద్ లో అపారమైన ఖనిజ సంపద ఉంది
  • విద్య, వైద్యం ఈ ప్రాంతానికి ఇప్పటికీ అందలేదు
  • కాళేశ్వరం, కూలేశ్వరం అయ్యింది
  • లక్ష కోట్లు గోదావరిలో పోశారు.
  • ఆదిలాబాద్ జిల్లాకు చుక్క నీరు రాలేదు
  • తుమ్మిడెహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల మళ్లీ ప్రారంభిస్తాం.. 
  • ఆదిలాబాద్ కు సాగునీరు అందిస్తాం
  • జూన్ 2 వరకు విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేస్తాం
  • ఆదిలాబాద్ జిల్లాను పారిశ్రామిక వాడగా మారుస్తాం
  • దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తాం
  • భూసేకరణ పనులు జరుగుతున్నాయి
  • ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తాం.. 
  • ప్రతి రెండు నెలలకు ఆదిలాబాద్ వస్తా
  • 2027 వరకు జిల్లా సరిహద్దులు మార్చం.. 
  • 2027  తర్వాత జిల్లా,  మండలాల పునర్విభజన

ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి, మంత్రి కొండా సురేఖ తదితరులు  పాల్గొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు సీఎం. ఇచ్చోడ నుంచి డెడ్రా రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా ముత్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేశారు. సిరికొండ-కొండాపూర్ వంతెన ప్రారంభించారు. బోధ్ లో యంగ్ ఇండడియా స్కూల్ కు శంకుస్థాపన చేశారు. నాగోబా దేవస్థానం అభివృద్ధి పనులు ప్రారంభించారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు.