హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం(ఫిబ్రవరి 26) జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న మంగళ గౌరి షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపింగ్ మాల్ లోపల చెలరేగిన మంటలు బయటికి వ్యాపించి సెట్టింగ్ కు అంటుకొని భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే భవనం మొత్తం బుగ్గయ్యింది. ప్రమాదంలో సమయంలో మాల్ లె కొందరు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకొని మంటలార్పుతున్నారు. పక్క భవనాలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తపడ్డారు. మాల్ లో చిక్కుకున్న సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
