హైదరాబాద్: కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం (డిసెంబర్ 13) సాయంత్రం కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని మూసాపేట్ లో ఓ బైక్ మెకానిక్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపు మొత్తం పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి షాపులో ఉన్న పనిముట్లు అన్ని తగలబడి పోయాయి.
మంటలు ఎగిసిపడుతుండటంలో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పారు. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలార్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్క్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

