31న మాలల రౌండ్ టేబుల్ మీట్.. కవితకు ఆహ్వానం

31న మాలల రౌండ్ టేబుల్ మీట్..    కవితకు ఆహ్వానం

ముషీరాబాద్, వెలుగు: మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, మేధావులు స్పందించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్ బాబు కోరారు. ఈ నెల 31న బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని కోరుతూ ఆదివారం ఆయన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆహ్వాన పత్రికను అందజేశారు. మాల సామాజిక వర్గంతో పాటు గ్రూప్-3లోని 26 కులాలకు న్యాయం జరిగేలా చూడాలని కవితకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.