హక్కుల సాధనకు మాలలు ఐక్యంగా పోరాడాలి.. ఓయూలో మాలల ఆత్మీయ సమ్మేళనం’

హక్కుల సాధనకు మాలలు ఐక్యంగా పోరాడాలి.. ఓయూలో మాలల ఆత్మీయ సమ్మేళనం’

ఓయూ, వెలుగు: హక్కుల సాధన కోసం మాలలు సంఘటితంగా పోరాడాలని మాల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజ్ సెమినార్ హాల్‌‌లో ఆదివారం ‘మాలల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు.

తెలంగాణ మాల స్టూడెంట్ జేఏసీ, ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పి.వి.సునీల్ కుమార్, డాక్టర్​ ఎం.ఎఫ్.గోపినాథ్, మాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మందాల భాస్కర్ ప్రసంగించారు.

ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు రిజర్వేషన్లు, రోస్టర్​ పాయింట్లలో జరుగుతున్న అన్యాయంపై వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు ఆర్.లింబాద్రి, కర్రె సదాశివ, మాయాదేవి, వెంకటేశ్వర్లు, విద్యార్థి నాయకులు మాదాసు రాహుల్ రావు, నామా సైదులు, బత్తుల రమేశ్​ 
తదితరులు పాల్గొన్నారు.