బండి సంజయ్‌‌ ను బర్తరఫ్ చేయాలి : మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి

బండి సంజయ్‌‌ ను బర్తరఫ్ చేయాలి : మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి
  • మాలమహానాడు ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి

గోదావరిఖని, వెలుగు: బండి సంజయ్‌‌ను కేంద్ర సహాయమంత్రి పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని మాలమహానాడు ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు పసుల రామ్మూర్తి డిమాండ్​ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం జరిగిన మీటింగ్‌‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ నాయకులకు ఒకతీరు, సామాన్యులకు మరో తీరుగా పోలీస్‌‌ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు. 

బాలికపై బండి భగీరథ్‌‌ అత్యాచారం చేసినట్టు కేసు నమోదైన నేపథ్యంలో అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. అనంతరం మాలమహానాడు ఆఫ్​ ఇండియా  యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గోదావరిఖనికి చెందిన బండి రామును నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్, దేవి లక్ష్మీనర్సయ్య, ఆరే దేవకర్ణ, గంట భవిత, కోల శ్రీనివాస్, జక్కుల నారాయణ, గాదం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.