- పోస్టర్ ఆవిష్కరించిన నిర్వాహకులు
ఓయూ, వెలుగు: ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా మాల స్టూడెంట్ జేఏసీ, హంస ఆధ్వర్యంలో ఈ నెల 15న ‘మాల విద్యార్థుల, ఉద్యోగుల, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను బుధవారం నిర్వాహకులు ఆవిష్కరించారు. మాలాల సామాజిక అభివృద్ధి, అన్ని రంగాల్లో ఉనికిని చాటుకోవడంపై ఇందులో చర్చించనున్నట్లు తెలిపారు.
మాలల రాజకీయ వాటా, ప్రాతినిధ్యం బలోపేతం చేసే దిశగా మేధావుల సూచనలతో భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, మాదాసు రాహుల్ రావు, నామ సైదులు, ప్రొఫెసర్లు సవీన్ సౌడా, వెంకటేశ్వర్లు, ఉదయ్, బత్తుల రమేశ్, దాసరి రవి సహా పలువురు పాల్గొన్నారు.
