ఆరోగ్యంపై బుక్ రాసిన బాలీవుడ్ బ్యూటీ..

ఆరోగ్యంపై బుక్ రాసిన బాలీవుడ్ బ్యూటీ..

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఐటమ్ సాంగ్స్ తో ఎంతో క్రేజ్ సంపాదింకున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ టాలీవుడ్ లో కూడా సుపరిచితురాలే.. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో కుర్రకారును ఆకట్టుకుంది. ఇదిలావుంటే.. మలైకా ఆరోగ్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈమె క్రమం తప్పకుండా జిమ్ లో వర్క్ అవుట్లు చేస్తూ.. తన బాడీని చాలా ఫిట్ గా మెంటెన్ చేస్తుంది. అంతేకాదు ఫుడ్ విషయంలో కూడా ఈ అమ్మడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఫర్ఫెక్ డైట్ ను ఫాలో అవుతుంది. అందుకే 50 ఏళ్ల చేరువలో కూడా ఎంతో అందం, ఆరోగ్యంగా కనిపిస్తుంది. అయితే పలు వ్యాపకాలతో బిజీగా ఉండే మలైక మరో ముందడు వేసింది. తాజాగా ఆమె రైటర్ గా మారింది.  

మలైకా అరోరా ఓ బుక్ ను రాసింది..ఈ బుక్ లో ఆరోగ్యనికి సంబంధించిన సమస్యలు వాటి పరిష్కారాలు ఉంటాయని తెలస్తోంది. ఈ బుక్ గురించి మలైకా మాట్లాడుతూ.. " ఈ బుక్ రాయడం వల్ల నా మనస్సులోని భావాలను చాలా మందికి తెలియజేసే అవకాశం ఉంటుంది. మనం శారీరకంగా ఫిట్ గా బాగుంటేనే.. మానసికంగా ప్రశాంతంగా ఉంటామాని నేను నమ్ముతున్నాను. మనస్సు,శరీరం ఏది బాగాలేకున్నా.. మన జీవితంపై ఎంతో ప్రభావం పడుతుంది. అందుకే బాడీ ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రముఖ్యతనివ్వాలి అని నా అభిప్రాయం" అని మలైక తెలపింది. కాగా, ఈ బుక్ ఎప్పుడు ప్రచురిస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం అధికారికంగా ప్రకటించాల్సివుంది.