మలక్ పేట్ ఆస్పత్రిలో విధులు బహిష్కరించిన ఉద్యోగులు

మలక్ పేట్ ఆస్పత్రిలో విధులు బహిష్కరించిన ఉద్యోగులు

మలక్ పేట్ ఏరియా హాస్పిటల్ సిబ్బంది విధులు బహిష్కరించారు. విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై గత శనివారం కొందరు వ్యక్తుల దాడి చేశారని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. పేషెంట్ కు సంబంధించిన పలువురు వ్యక్తులు సెక్యూరిటీ సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడి చేశారన్నారు. చాదర్ ఘాట్ పీఎస్ లో కంప్లైంట్ చేశామన్నారు హాస్పిటల్ సిబ్బంది.

అయితే ఫిర్యాదు చేసి రెండు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటూ ఫైర్ అయ్యారు. దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకునే వరకు విధుల్లోకి వెళ్లబోమంటున్నారు వైద్య సిబ్బంది. మరోవైపు హాస్పిటల్ సిబ్బంది నిరసనతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.