‘తోబా’తో మాళవిక మోహనన్ రొమాంటిక్ ట్రీట్

‘తోబా’తో మాళవిక మోహనన్ రొమాంటిక్ ట్రీట్

మాస్టర్, మారన్ లాంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది మాళవిక మోహనన్. కెరీర్ ప్రారంభించి పదేళ్లు కావస్తున్నా నటించిన సినిమాలు మాత్రం పదిలోపే. అయినప్పటికీ సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే మాళవిక.. ట్రెండీ ఫొటోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను షేర్ చేస్తూ ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాలోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం ముందుంటోంది. ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మారుతి తీయబోయే సినిమాలో మాళవికనే హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటూ ఆమధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమా విషయంలోనూ తన పేరు వినిపించినా అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. సినిమా అవకాశాల మాటెలా ఉన్నా ఇప్పుడో మ్యూజిక్ వీడియోతో అభిమానులకు రొమాంటిక్ ట్రీట్ ఇచ్చింది మాళవిక. 

‘తోబా’ పేరుతో రూపొందిన ఈ మీడియోలో పాపులర్ ర్యాపర్ షా, ప్లే బ్యాక్ సింగర్ పాయల్ దేవ్ కూడా నటించారు. ఈ పాటను రాసింది, పాడింది కూడా వీళ్లిద్దరే. అయితే వీడియోలో హైలైట్ అయ్యింది మాత్రం మాళవికనే. నిజానికి ఇలా మ్యూజిక్ వీడియోలో కనిపించడం ఆమెకు ఇదే తొలిసారి. అయినప్పటికీ చిన్న చిన్న డ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, రొమాంటిక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకులను చూపు తిప్పుకోనీయకుండా ఆకట్టుకుందామె. దీంతో ఇప్పటికే ఈ పాటకు 12 మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పైగా వ్యూస్ వచ్చాయి. మరి వచ్చినట్టే వచ్చి చేజారుతున్న అవకాశాలు ఈ పాటతోనైనా ఆమెను వరిస్తాయేమో చూడాలి!