ఇటీవల కేరళ బాక్సాఫీస్ దగ్గర వంద కోట్ల మైలురాయిని దాటి సంచలనం సృష్టించిన చిత్రం ‘వాలా 2’. మలయాళంలో మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 'షైన్ స్క్రీన్స్' అధినేత సాహు గారపాటి ఏప్రిల్ 24న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు.
సావిన్ ఎస్.ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వంటి యువ నటీనటులు నటించారు. దర్శకుడు అల్ఫోన్స్ పుత్రన్ కీలక పాత్ర పోషించారు. తెలుగు నిర్మాత సాహు గారపాటి, విపిన్ దాస్, ఇతర నిర్మాతలతో కలిసి మలయాళంలో నిర్మించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకుంటుందని నిర్మాతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

