మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఈ నెల 17 నుంచి 23 వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 227 మందిని పట్టుకుని కేసులు నమోదు చేశారు. వీరిలో 10 మందికి రక్తంలో మద్యం మోతాదు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. మద్యం మత్తులో ప్రమాదాలకు కారణమైతే కొత్త చట్టాల ప్రకారం 10 ఏండ్ల వరకు జైలు శిక్ష పడుతుందని పోలీసులు హెచ్చరించారు. గత వారంలో న్యాయస్థానం ముందుకొచ్చిన పాత కేసుల్లో 293 కేసులు పరిష్కారం అవ్వగా.. కోర్టు 11 మందికి జైలు శిక్ష, ఇద్దరికి సామాజిక సేవ, మిగిలిన 280 మందికి జరిమానాలు విధించినట్లు తెలిపారు.
