మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక : బీరెల్లి కమలాకర్ రావు

మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక : బీరెల్లి కమలాకర్ రావు
  •  అధ్యక్షుడిగా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా బీరెల్లి కమలాకర్ రావు  

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర మెడికో పేరెంట్స్ అసోసియేషన్ కు నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా మల్లోజు సత్యనారాయణ చారి, ప్రధాన కార్యదర్శిగా బీరెల్లి కమలాకర్ రావు ఎన్నికయ్యారు. నాగోల్‌‌‌‌లోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మెడికో పేరెంట్స్ అసోసియేషన్ కొత్త కమిటీని ఎన్నుకున్నారు.  

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పొడిశెట్టి రమేష్ కుమార్, బొడ్డుపల్లి అంజయ్య, సుజాత, సంయుక్త కార్యదర్శులుగా టి. రత్నప్రసాద్, గునుగుంట్ల శ్రీనివాస్ గౌడ్, నాగేందర్, యాదగిరి ఎన్నికయ్యారు. కోశాధికారిగా రవికుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కె. శ్రీధర్ రావు, ప్రచార కార్యదర్శిగా కె. వెంకట్రావును  ఎన్నుకున్నారు.