కేటీఆర్​పై ఈసీకి మల్లు రవి ఫిర్యాదు

కేటీఆర్​పై ఈసీకి మల్లు రవి ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థి బిట్స్ పిలానీ స్టూడెంట్​అని, కాంగ్రెస్ అభ్యర్థి పల్లీ బఠానీ అంటూ కేటీఆర్​చేసిన కామెంట్స్​పై పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఫైరయ్యారు. ఆయన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. బిట్స్ పిలానీ అభ్యర్థి అయితే అక్కడికే వెళ్లి ఓట్లు అడగాలని సూచించారు.

శనివారం గాంధీ భవన్ లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు.  బిట్స్ పిలానీలో చదివినోళ్లే గ్రాడ్యుయేట్లా? మిగతా వాళ్లు కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్​ కామెంట్లతో గ్రాడ్యుయేట్లపై ఆ పార్టీ వైఖరి తెలిసిపోయిందన్నారు.  మల్లన్నను గెలిపిస్తే గ్రాడ్యుయేట్ల సమస్యలను  కౌన్సిల్ లో ప్రస్తావిస్తారన్నారు. అన్ని పార్టీలు మల్లన్ననే గెలిపించాలని తీర్మానించాయని గుర్తు చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీ సీఈవో వికాస్ రాజ్ కు మల్లు రవి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం బీఆర్ కే భవన్ లో సీఈవోను కలిశారు. కేటీఆర్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.


Mallu Ravi's complaint to EC against KTR