పెగాసస్పై స్పైవేర్ ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పలేం

పెగాసస్పై  స్పైవేర్ ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పలేం

పెగాసస్ వ్యవహారంపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. 29 ఫోన్లను పరిశీలించగా వాటిల్లో 5ఫోన్లలో మాల్వేర్ ఉన్నట్లు గుర్తించామని న్యాయస్థానం తెలిపింది. కానీ ఒక్క ఫోన్ లో కూడా పెగాసస్ స్పైవేర్ ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పలేమని కమిటీ రిపోర్టు ఇచ్చినట్లు పేర్కొంది. కమిటీ ఇచ్చిన రిపోర్టును పరిశీలిస్తున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అయితే పెగాసస్ అంశంలో కేంద్రం సహకరించడంలేదని కమిటీ తెలిపినట్లు సీజేఐ వెల్లడించారు.

సైబర్ దాడుల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా కొత్త చట్టాలు అవసరమని కమిటీ సూచించిందని సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ చెప్పారు.  అయితే కమిటీ రిపోర్టు అందరికీ అందుబాటులో ఉంచేది కాదన్నారు. మూడు భాగాలుగా రిపోర్టు ఉందన్న ఆయన..రెండు టెక్నికల్ కమిటీ రిపోర్టులని..రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ మరో నివేదిక ఇచ్చారన్నారు. జస్టిస్ రవీంద్రన్ ఇచ్చే రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో పెడతామని సీజేఐ తెలిపారు. ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.