న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉన్న బెంగాలీలను అక్కడి పోలీసులు వేధిస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ నుంచి వచ్చిన ప్రజలను ఢిల్లీ పోలీసులు వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. సోమవారం ఢిల్లీలోని ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్‌తో భేటీకి ముందు మమతా మీడియాతో మాట్లాడారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను న్యాయం కోసం ఢిల్లీకి తీసుకువచ్చామని తెలిపారు.
ఇక్కడి పోలీసులు మాత్రం ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. కాగా, సర్ ప్రక్రియ వల్ల తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారంటూ బెంగాల్‌కు చెందిన 100కుపైగా కుటుంబాలు సోమవారం ఢిల్లీలోని బంగా భవన్‌కు చేరుకున్నాయి. దీంతో పోలీసు బలగాలు కూడా పెద్ద సంఖ్యలో మోహరించాయి.
ఇది చూసి మమతా బెనర్జీ పోలీసులపై ఫైర్ అయ్యారు. న్యాయం కోసం వచ్చినవాళ్లను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. సాధారణ గ్రామీణులపై అరాచకాలు ఆపాలని సూచించారు. అపాయింట్‌మెంట్ తీసుకొని వచ్చినా బాధితులను మీడియాతో
మాట్లాడనివ్వట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
