కోల్‌కతా: బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసు కుంది. భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం కలకత్తా హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను ధృవీకరించేందుకు మమతా బెనర్జీ స్వయంగా హైకోర్టు రిజిస్ట్రీకి వెళ్లారు. కోర్టు ప్రాంగణం నుంచి తిరిగి వెళ్లే సమయంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. భవానీపూర్ స్థానంలో బీజేపీ నేత సువేందు చేతిలో మమత 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
