V6 News

ఆ రెండు బిల్లులకు ముడిపెట్టడం వెనుక భారీ కుట్ర..! : మమత

ఆ రెండు బిల్లులకు ముడిపెట్టడం వెనుక భారీ కుట్ర..! : మమత
  • బీజేపీ సర్కారు దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నది

కోల్‌‌కతా: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు, డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు ముడిపెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందని బెంగాల్​సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడానికి, దేశవ్యాప్తంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్​ఆర్​సీ) అమలు చేయడానికి ఇది ఒక మార్గమని ఆమె పేర్కొన్నారు. 

గురువారం బెంగాల్​లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను కలిపి ‘భారతదేశాన్ని విభజించేందుకు’ ప్రయత్నాలు జరుగుతున్నాయని మమత ఆరోపించారు.  మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో ఆమోదం పొందిందని.. మరిదాని అమలులో ఎందుకు జాప్యం జరిగిందని ఆమె ప్రశ్నించారు.