
‘తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్’ అంటూ నకిలీ జీవో వైరల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సంజయ్ అనే వ్యక్తే దీనికి కారణమని గుర్తించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉండే సంజయ్.. చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ పెడుతున్నారంటూ ఓ నకిలీ జీవో తయారుచేసి సంజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ జీవో వైరల్ కావడంతో చాలామంది లాక్‌డౌన్ నిజమనుకున్నారు. ఆ విషయం పోలీసుల దృష్టికి రావడంతో.. దర్యాప్తు జరిపి సంజయ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. తాను జోక్ చేయడానికే నకిలీ జీవోను గ్రూప్‌లో పెట్టానని పోలీసులకు తెలిపాడు. సంజయ్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరెవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.