పంద్రాగస్టు రోజు మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

పంద్రాగస్టు రోజు మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

ఘట్​ కేసర్, వెలుగు : పంద్రాగస్టు రోజు అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని పోచారం ఐటీసీ పోలీసులు అరెస్టు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. పోచారం మున్సిపాలిటి అన్నోజిగూడ పరిధి సూర్యనగర్ కాలనీ చెందిన వంగాల వెంకటేశ్​ గురువారం అక్రమంగా మద్యం అమ్ముతున్న

సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి దాడి చేశారు. కేఎఫ్ బీర్లు 32, ఓసీ క్వాటర్లు 25, ఐబీ 9, డౌన్ టౌన్ 12, ఎంసీ 12, ఓసీ 12, రాయల్ స్టాగ్ 3 బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుడు వెంకటేశ్​పై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.