
జీడిమెట్ల, వెలుగు: తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ వ్యక్తిపై మహిళ నింద వేయడంతో సదరు వ్యక్తి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం సీఐ సుధీర్ కృష్ణ తెలిపిన ప్రకారం... కైసర్‌నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివాసముండే రాజు(55) బాలానగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
మంగళవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. మెట్లు ఎక్కే టైంలో రాజు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆరోపించింది. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి 2 గంటలకు కొంతమందిని తీసుకొచ్చి రాజుతో గొడవ పడింది. దీంతో మనస్తాపానికి గురైన రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.