హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడలో దారుణం జరిగింది. జీతం డబ్బులు అడిగిందుకు భార్యను హత్య చేశాడో భర్త. ఏఎస్ రావు నగర్, కాప్రాలో నివాసముంటున్న సంతోష్ చౌహాన్.. పరమేశ్ పాటిల్ అనే వ్యాపారి దగ్గర పనిచేసే వాడు. అయితే గత రాత్రి జీతం డబ్బుల విషయమై అతని భార్య దీపాలి చౌహాన్ తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో దీపాలి తన భర్తపై కోపంతో కిచెన్ లో ఉన్న పట్టుకారును అతనిపై విసిరింది. ఆగ్రహవేశాలకి లోనైన సంతోష్ భార్య దీపాలి గొంతు నులిమి హతమార్చాడు. కొంతసేపటికి తన భార్య ఆత్మహత్య చేసుకుందని స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న సంతోష్ యజమాని పరమేష్ కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించాడు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సంతోష్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
