పటాకులు ఇస్తానని చెప్పి.. ఎనిమిదేళ్ల బాలుడిపై అత్యాచారం

పటాకులు ఇస్తానని చెప్పి.. ఎనిమిదేళ్ల బాలుడిపై అత్యాచారం

పటాకులు ఇస్తానని మాయమాటలతో ప్రలోభపెట్టి ఎనిమిదేళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన 32 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఈ క్రమంలో బాలుడిని చంపేస్తానని కూడా బెదిరించాడని పోలీసులు చెప్పారు.

"మైనర్ తన ఇంటి సమీపంలో క్రాకర్లు పేలుస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. నిందితుడు మరిన్ని బాణాసంచా ఇస్తానని అతన్ని సమీపంలోని భవనంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు ఈ సంఘటనను ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం" అని ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

ఈ ఘటన నవంబర్ 13న జరగగా.. బాలుడు ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. తల్లిదండ్రులు అతను ఏడుస్తూ ఉండటం చూసి కారణం అడగడంతో, అతను జరిగిన సంఘటనను వారితో వివరించాడు, ఆ తరువాత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారి ఫిర్యాదు మేరకు.. పోలీసులు నిందితుడిని నవంబర్ 14న అరెస్టు చేసి, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై ఇప్పటికే రెండు వేధింపుల కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.