దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. మీరు జోక్యం చేసుకోవాలి.. సుప్రీంకోర్టుకు ప్రతిపక్ష నాయకుల లేఖ

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. మీరు జోక్యం చేసుకోవాలి..  సుప్రీంకోర్టుకు ప్రతిపక్ష నాయకుల లేఖ

ఎన్నికల సంఘం (ECI) స్వతంత్రంగా వ్యవహరించడం లేదని, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో నిర్వహించిన SIR ద్వారా ఓటరు జాబితాల నుంచి భారీ సంఖ్యలో పేర్లు తొలగించారని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ వల్ల పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, వలస కార్మికులు వంటి వర్గాల ఓటు హక్కు దెబ్బతిన్నట్లు ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌లో లక్షలాది మంది ఓటర్ల పేర్లు తప్పుగా తొలగించారని, న్యాయస్థానాల ముందు వచ్చిన అనేక కేసుల్లో ఆ తొలగింపులు తప్పని తేలిందని లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల నిర్వహణపైనా అనుమానాలు వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకులు. SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, ఎన్నికలకు చాలా ముందుగానే పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.

ALSO READ : మధ్యలో కేటీఆర్ ఎవరు, హరీష్ ఎవరు..? 

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMలు)పై కూడా సందేహాలు వ్యక్తం చేస్తూ, అవసరమైతే బ్యాలెట్ పేపర్ల విధానాన్ని పునరాలోచించాలని సూచించారు. సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై రాజకీయంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.