నేరేడ్ మెట్ లో మర్డర్..మద్యం మత్తులో ఘర్షణ..

నేరేడ్ మెట్ లో మర్డర్..మద్యం మత్తులో ఘర్షణ..
  •     కత్తితో పొడిచి వ్యక్తి హత్య

నేరెడ్​మెట్, వెలుగు: నేరెడ్​మెట్​పరిధిలోని వినాయక్ నగర్ మూడు గుళ్ల ప్రాంతంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారితీసింది. వినాయక్ నగర్ మూడు గుళ్లకు చెందిన సందీప్, జాన్‌‌ కలిసి మద్యం సేవించారు. అయితే, ఇద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన సందీప్..జాన్‌‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాన్ అక్కడికక్కడే చనిపోయాడు. నేరేడ్మెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.