ఫేక్ ఏసీబీ కార్డుతో తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్

ఫేక్ ఏసీబీ కార్డుతో తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: ఏసీబీ డిపార్ట్ మెంట్ కు చెందిన అధికారినని చెప్పుకుంటూ కారులో యథేచ్ఛగా తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 105 వద్ద చెకింగ్ చేస్తున్న పోలీసులకు ఫేక్ ఏసీబీ, హ్యూమన్ రైట్స్ అబ్జర్వర్ కార్డ్స్ తో తిరుగుతున్న వ్యక్తి దొరికాడు. డూప్లికేట్ కార్డులు పెట్టుకొని తిరుగుతున్న అతడి వాహనాన్ని సీఐ సీజ్ చేశారు. ఇలా డూప్లికేట్ కార్డులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.