మన ఊరు మన బడి టెండర్ల రద్దు చేశామన్న ప్రభుత్వం

మన ఊరు మన బడి టెండర్ల రద్దు చేశామన్న ప్రభుత్వం

మన ఊరు మన బడి టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం అంగీకరించింది. వాటిని రద్దు చేసినట్లు హైకోర్టుకు విన్నవించింది. మన ఊరు మన బడి టెండర్లలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటీషన్పై ఇవాళ హైకోర్టు విచారణ జరపగా.. ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇచ్చింది. టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కేంద్రీయ బండార్ జెనిత్ మెటప్లస్ ప్రైవేట్ లిమిటెడ్, వీ 3 ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించాయి. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, టీఎస్ డబ్ల్యూఐడీసీ చీఫ్ ఇంజనీర్, ఎలెగంట్ మెథడాక్స్ సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. టెండర్ నిబంధనల్లోని అర్హతలన్నీ ఉన్నప్పటికీ తమను పక్కనబెట్టి ఎలగంట్ మెథడిక్స్ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడాన్ని సవాల్ చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై  విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. టెండర్ నిబంధనల్లోని అన్ని అర్హతలు తమకున్నా.. కారణం చెప్పకుండా టెండర్ ఇవ్వలేదని కోర్టుకు విన్నవించారు.  ఏ కారణంగా అర్హత లేని కాంట్రాక్టరుగా చూపారో వెల్లడించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టెండర్లు రద్దు చేసినట్లు ప్రకటించింది.