V6 News

కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని మానేరు విద్యార్థులు విజయకేతనం

కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని  మానేరు విద్యార్థులు విజయకేతనం

కరీంనగర్ టౌన్,వెలుగు: పదోతరగతి ఫలితాల్లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌ మానేరు విద్యార్థులు విజయకేతనం ఎగురువేసినట్లు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్వరా మౌఖ్తిక, అర్ఫా యుస్రా, సానియాలు 574 మార్కులు సాధించి టాపర్‌‌‌‌‌‌‌‌గా నిలిచారన్నారు.

అజ్మతున్నీస్సా 572, పర్నికా 570 మార్కులు సాధించినట్లు వెల్లడించారు.  65 శాతం మంది విద్యార్థులు 500కు పైగా మార్కులతో రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ కడారి సునీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.