
హైదరాబాద్, వెలుగు: సౌందర్య రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా హయత్ నగర్‌కు చెందిన వై.యం. శిరీష యాదవ్ కు ప్రతిష్టాత్మక మహానంది అవార్డు –-2025 లభించింది. కాచిగూడలో ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీ హెర్బల్ బ్యూటీ మేకప్ అండ్ నెయిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ గా ఉన్న శిరీషకు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ అధ్యక్షుడు వంశీకృష్ణ అవార్డును ప్రదానం చేశారు.