మణప్పురం డోర్‌ టు డోర్‌ సర్వీస్‌

మణప్పురం డోర్‌ టు డోర్‌ సర్వీస్‌

వెలుగు: మణప్పురం పైనాన్స్ కంపెనీ ఇంటి వద్దకే వచ్చి గోల్డ్ లోన్లను ఆఫర్ చేస్తుంది. ఢిల్లీ, ముంబైలోని కస్టమర్లకు ఇంటి వద్దకే వచ్చి గోల్డ్ లోన్ ఆఫర్ చేయనున్నట్టు మణప్పురం ఫైనాన్స్ శుక్రవారం ప్రకటించింది. ముంబై, ఢిల్లీలో 50 బ్రాంచ్‌ లు ఈ సదుపాయం అందిం చనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది చెన్నై, బెంగళూరులో విజయవంతంగా ఈ సర్వీసులను లాంచ్ చేసింది. చెన్నైలో 107 బ్రాంచుల్లో, బెంగళూరులో 183 బ్రాంచుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. సౌకర్యం , భద్రతలను దృష్టిలో ఉంచుకుని.. వినియోగదారులు బంగారం లేదా నగదుతో ప్రయాణించాల్సినవసరం లేకుండా.. నేరుగా అకౌంట్లలోకే నగదు ట్రాన్స్‌‌ఫర్ అయ్యేలా చూస్తున్నామని కంపెనీ తెలిపింది.

ముంబై కస్టమర్ల కోసం 09072606215 , ఢిల్లీ కస్టమర్ల కోసం 09072606202 నంబరుపై హెల్ప్ లైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గోల్డ్ లోన్ కావాలనుకునే కస్టమర్ల ఇంటికి కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగు లు సరియైన ఐడెంటిఫికేషన్‌‌తో వచ్చి, ప్రొసీజర్ పూర్తి చేసుకుని వెంటనే ఎన్‌‌ఈఎఫ్‌ టీ లేదా ఐఎంపీఎస్ ద్వారా కస్టమర్ల బ్యాంక్ అకౌంట్లలోకి నగదు జమ చేస్తారు. ఇందుకు ప్రత్యేక టీమ్‌ లను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది.