‘లవ్ యూ రామ్’ చిత్రం నుంచి మనసు మాట వినదే పాట విడుదల

‘లవ్ యూ రామ్’ చిత్రం నుంచి మనసు మాట వినదే పాట విడుదల

సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్‌‌ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్స్‌‌తో దర్శకుడిగా మెప్పించిన దశరథ్.. కథను అందిస్తూ, నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. రోహిత్ బెహల్, అపర్ణ జనార్థనన్ జంటగా నటిస్తున్నారు. డివై చౌదరి దర్శకుడు. బుధవారం ఈ సినిమా నుండి ‘మనసు మాట వినదే’ అనే పాటను విడుదల చేశారు. హీరో నాగార్జున ఈ పాటను లాంచ్ చేసి, టీమ్‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. కె.వేద కంపోజ్ చేసిన ఈ లవ్లీ మెలోడీ సాంగ్‌‌ను దివ్య మాలిక పాడింది. వరికుప్పల యాదగిరి లిరిక్స్ రాశారు.

పాటలో హీరోహీరోయిన్స్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. బెనర్జీ, ప్రదీప్, కాదంబరి కిరణ్, కార్టూనిస్ట్ మల్లిక్, మీర్, కె దశరధ్, డివై చౌదరి, ప్రభావతి వర్మ, శాంతి దేవగుడి ఇతర పాత్రలు పోషించారు.