విజయారెడ్డి హత్య కేసులో కావాలనే బురద జల్లుతున్నారు

విజయారెడ్డి హత్య కేసులో కావాలనే బురద జల్లుతున్నారు

తహసీల్దార్ విజయారెడ్డి హత్యతో అబ్దుల్లాపూర్ మెట్ భూములపై రాజకీయ దుమారం రేగుతోంది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి మధ్య  ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. విజయారెడ్డి హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలు కొట్టిపారేశారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి.  తనపై కావాలనే  బురదజల్లుతున్నారన్నారు. విజయారెడ్డి మరణాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న  మల్ రెడ్డి రంగారెడ్డి గత ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక తనపై తప్పడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. భూములు కొనుగోలు చేసింది మల్ రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి కుటుంబ సభ్యులేనని అన్నారు.

అబ్దుల్లాపూర్ మెట్లో మొత్తం 412 ఏకారాలపై దర్యాప్తు చేపట్టాలన్నారు. అంబర్ పేట దగ్గర  16 ఎకరాల భూమిని మల్ రెడ్డి రంగారెడ్డి కుటుంబ సభ్యులు కబ్జా చేశారన్నారు. నిందితుడు సురేష్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ లో ఉన్నాడని చెప్పారు. తాను రూ. 30లక్షలు తీసుకున్నానంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. విచారణలో వాస్తవాలేంటో బయటపడుతాయన్నారు. భూములపై విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్ ను కూడా కోరుతానన్నారు.