
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే మంగళవారం హైదరాబాద్ రానున్నారు. 2రోజులు ఇక్కడ ఉంటా రు. 4 రోజుల కింద చనిపోయిన పీసీసీ సోషల్ మీడియా కో‑ఆర్డినేటర్ సింధూ శంకర్ కుటుంబాన్ని మంగళవారం పరామర్శిస్తారు. అదేరోజు సాయంత్రం పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్‌రావు కూతురు, మహారాష్ట్ర ఎమ్మెల్యే కైలాశ్ గోరంట్యాల్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. బుధవారం ఉదయం పార్టీ ఎస్టీ విభాగం చైర్మన్, జిల్లా ప్రెసిడెంట్లు, ఆఫీస్బేరర్లతో భేటీ అవుతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం పార్టీ వైస్ప్రెసిడెంట్లతో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రపై రివ్యూ చేస్తారని వెల్లడించింది. సాయంత్రం కిసాన్ కాంగ్రెస్ చైర్మన్, జిల్లా అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లతో భేటీ అయి గురువారం నాగ్‌పూర్ వెళ్తారు.