Tripura election result: బోర్దోవాలిలో సీఎం మాణిక్ సాహా విజయం

Tripura election result: బోర్దోవాలిలో సీఎం మాణిక్ సాహా విజయం

త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. త్రిపురలో మరోసారి అధికారం దక్కించుకునే దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. త్రిపుర బీజేపీ సీఎం మాణిక్ సాహా విజయం సాధించారు. సాహా సుమారు 832 ఓట్ల తేడాతో బోర్దోవాలి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ కుమార్ సాహాపై విజయం సాధించారు. కాగా.. గతంలో త్రిపుర సీఎంగా దేబ్ నియంతృత్వ ధోరణి వల్ల ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ మాణిక్ సాహాను సీఎం చేసింది. ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో... త్రిపురలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా బలగాలు మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఇక  కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ సెపాహిజాలా జిల్లాలోని ధన్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి సబ్రూమ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.