సింగరేణి ఓసీ వద్ద ప్రమాదం..డంపర్‌‌‌‌కు రిపేర్లు  చేస్తుండగా పేలిన టైర్‌‌‌‌

సింగరేణి ఓసీ వద్ద ప్రమాదం..డంపర్‌‌‌‌కు రిపేర్లు  చేస్తుండగా పేలిన టైర్‌‌‌‌
  • ఒకరు మృతి, నలుగురికి గాయాలు    
  • మణుగూరు ఏరియా సింగరేణి ఓసీ-2 వద్ద ఘటన

మణుగూరు/పినపాక, వెలుగు : డంపర్‌‌‌‌ రిపేర్‌‌‌‌ చేస్తుండగా టైర్‌‌‌‌ పేలడంతో ఓ వ్యక్తి చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సింగరేణి ఓసీ-2లో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ 2లో ఓబీ నిర్వహణ పనులను వీపీఆర్‌‌‌‌ కంపెనీ నిర్వహిస్తోంది. ఆదివారం ఉదయం కంపెనీకి చెందిన సానియా ట్రక్​(డంపర్‌‌‌‌) మొరాయించింది.

డంపర్‌‌‌‌కు బీహార్‌‌‌‌కు చెందిన టైర్‌‌‌‌ ఫిట్టర్‌‌‌‌ సర్ఫరాజ్‌‌‌‌ (40), డ్రైవర్‌‌‌‌ సాహెబ్‌‌‌‌ బల్‌‌‌‌ యాదవ్‌‌‌‌, మంద కుమార్‌‌‌‌, జగదీశ్‌‌‌‌ కుష్వాల్‌‌‌‌, ఎండీ.తజన్‌‌‌‌ సారీ కలిసి రిపేర్లు చేస్తున్నారు. ఈ క్రమంలో డంపర్‌‌‌‌ టైర్‌‌‌‌ ఒక్కసారిగా పేలడంతో సర్ఫరాజ్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోగా మిగతా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సాహెబ్‌‌‌‌ బల్‌‌‌‌ యాదవ్‌‌‌‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం తరలించారు. మిగతా ముగ్గురు మణుగూరు సింగరేణి హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్నారు. గాయపడిన వారిని సింగరేణి యానియన్ల లీడర్లు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పరామర్శించారు.